తల్లాడ మండలం గొల్లగూడెం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తడిసిన ధాన్యాన్ని మంగళవారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతులను గుర్తించి పంట నష్టం పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.