వైరా నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో భారీ వర్షం

58చూసినవారు
వైరా నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో భారీ వర్షం
వైరా నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలలో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో రైతులు సాగుచేసిన పంటలకు ప్రాణం పోసినట్లయింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుండి ఎండ వేడిమితో అల్లాడిపోయిన ప్రజలకు మధ్యాహ్నము నుండి మేఘవృతమై అకాల వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత కొన్ని రోజులుగా రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఈ వర్షం ఎంతో ఉపయోగపడింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్