వైరా ఎస్ ఐ. రామారావును హ్యూమన్ రైట్స్ సొసైటీ సభ్యులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా హ్యూమన్ రైట్స్ సొసైటీ వ్యవస్థాపకులు ఆదూరి ఆనందం ఈ సొసైటీ ద్వారా పలు సామాజిక కార్యక్రమాలు చేస్తున్నామని, ప్రతి మండల కేంద్రంలో ఆశా కార్యకర్తలకు, డ్వాక్రా మహిళలకు, అంగన్వాడీ టీచర్ లకు, ఫీల్డ్ అసిస్టెంట్ లకు, హైస్కూల్ విద్యార్థులకు మానవ హక్కులు - చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామని ఎస్. ఐ. రామారావుకి వివరించారు.