మధిరలో జరిగే రాష్ట్ర స్థాయి తరగతులను జయప్రదం చేయండి

50చూసినవారు
మధిరలో జరిగే రాష్ట్ర స్థాయి తరగతులను జయప్రదం చేయండి
జూలై 13 14 తేదీలలో మధిర పట్టణంలో జరిగే ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని పి వై ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ వి రాకేష్ యువతకు పిలుపునిచ్చారు. బుధవారం కారేపల్లి లో మాట్లాడుతూ ప్రపంచ దేశాలలోనే అత్యధికంగా యువ సంపద కలిగిన దేశం భారతదేశం. కానీ యువశక్తిని పాలకులు సద్వినియోగం చేసుకోవడం లేదు. మద్యం, డ్రగ్స్, గంజాయి తదితర మత్తులో ఉండేలా యువతను నిర్వీర్యం చేస్తున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్