ఎక్సైజ్ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సాయి కుమార్ తెలిపారు. కామేపల్లి మండలంలోని బండిపాడుకు చెందిన ఈసం జ్యోతి కిరాణం షాపులో మద్యం అమ్ముతోందనే సమాచారంతో గత రాత్రి ఎక్సైజ్ ఎస్ఐ వసంతలక్ష్మి, సిబ్బంది తనిఖీ చేయగా మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. వీటిని సీజ్ చేస్తుండగా జ్యోతి కుటుంబ సభ్యులు అడ్డుకోవడమే కాక చేతులతో నెట్టేశారు. దీంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.