సేంద్రియ వ్యవసాయం చేపట్టి నేలతల్లిని కాపాడుకోవాలని రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ సభ్యుడు రాంరెడ్డి గోపాల్ రెడ్డి కోరారు. కామేపల్లి మండలం పాతలింగాల రైతు వేదికలో గురువారం నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో వారు పాల్గొని ప్రసంగించారు. రైతులు నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని సూచించారు. తక్కువ సమయంలో అధిక దిగుబడి పొందే వ్యవసాయంపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు.