కారేపల్లి మండలంలో సోమవారం ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటించనునట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రప్రకాష్ తెలిపారు. రేలకాయలపల్లి, జైత్ర తండాలో పర్యటించి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణమునకు శంకుస్థాపన చేస్తారని ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సకాలంలో హాజరుకావాలని కోరారు.