ఖమ్మం పకృతి ప్రేమికుడు వనజీవి రామయ్యకు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి తో కలిసి ఆదివారం భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కోటి మొక్కల ప్రదాత మృతి పకృతి ప్రేమికులకు తీరని లోటు అని అన్నారు. రామయ్యకు మొక్కలపై ఉన్న ప్రేమ మొక్కల గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయడంలో, పోషించినటువంటి పాత్ర మరవలేనివని గుర్తు చేసుకున్నారు.