హైదరాబాదులో నిర్వహిస్తున్న, మిస్ వరల్డ్ అందాల పోటీలను రద్దు చేయాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషరుద్దిన్ గురువారం డిమాండ్ చేశారు. వామపక్ష, మహిళా సంఘం, విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుంచి వైరా రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అందాల పోటీలకు ఖర్చు చేయడం ప్రజలపై భారం పడుతుందని తెలిపారు.