వైరా నియోజకవర్గ కొణిజర్ల మండలం, బీఆర్ఎస్ ఇన్ ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ ముఖ్యనాయకులతో సన్నాహక సమావేశం ఆదివారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈనెల 27వ తారీఖున వరంగల్లో నిర్వహించబోయే టీఆర్ఎస్ పార్టీ 25వ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ఎండ గడుతూ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు.