నిరంతరం యువత సమస్యలపై పోరాడే యువజన ఉద్యమాల సారధి డివైఎఫ్ఐ మండల, జిల్లా, రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల రమేష్ పిలుపునిచ్చారు. వైరా మండలం బోడేపూడి భవన్ లో పట్టణ కార్యదర్శి షేక్ నాగుల్ పాషా అధ్యక్షతన జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్న ఎన్నికల ముందు హామీ ఇచ్చిన యూత్ డిక్లరేషన్ కనీసం అమలు చేయడానికి కార్యాచరణ చేయలేదని చెప్పారు.