
మహిళా అధికారులను అవమానించడమేనా నవభారతం?: షర్మిల
AP: మహిళా అధికారులను అవమానించడంపై ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. ఆపరేషన్ సిందూర్లో ఎంతో కీలకంగా వ్యవహరించిన కల్నల్ సోఫియా ఖురేషీని ఉద్దేశించి BJP ఎంపీ కున్వర్ విజయ్ షా అత్యంత అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ‘మోదీ గొప్పగా చెబుతున్న కొత్త భారతదేశం ఇదేనా? మహిళా అధికారులను నీచంగా అవమానించడమేనా నవభారతం?’ అని షర్మిల ప్రశ్నించారు.