జూలూరుపాడు మండల కేంద్రంలో రేషన్ కార్డు లబ్ధిదారుడి ఇంట్లో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, స్థానిక నాయకులతో కలిసి శనివారం భోజనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ స్నేహితులు, తదితరులు పాల్గొన్నారు.