వైరాకు కోటా కంటే ఎక్కువ ఇళ్లు: మంత్రి

54చూసినవారు
వైరాకు కోటా కంటే ఎక్కువ ఇళ్లు: మంత్రి
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు 3, 500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుండగా, వైరాలో గిరిజనులు అధికంగా ఉన్నందున ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ వినతితో మరిన్ని ఇళ్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వైరాలోని క్యాంపు కార్యాలయంలో ఆయన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్దిదారులకు చెక్కులు అందజేసి మాట్లాడారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్ దత్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్