సీఎం
కేసీఆర్ ను గద్దె దించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, దేశ ప్రజలందరూ బిజెపి వైపు చూస్తున్నారని, బిజెపితోనే ప్రజలందరికీ న్యాయం చేకూరుతుందని వైరా నియోజకవర్గ నాయకులు కృష్ణ రాథోడ్ అన్నారు. సోమవారం సింగరేణి మండల కేంద్రంలోని కృష్ణ రాథోడ్ పార్టీ కార్యాలయంలో మీడియాతో ముచ్చటించారు. ప్రతి గడపకు తిరుగుతూ ప్రజల కష్టసుఖాలను, వారు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుంటున్నామని అన్నారు.