పిఓబి పట్టాదారు పాసుపుస్తకం కలిగిన రైతులకు తిరిగి రుణాలు అందజేయాలని కారేపల్లి సహకార పరపతి సంఘం డైరెక్టర్ కొత్తూరు రామారావు సోమవారం అన్నారు. కారేపల్లిలోని ఎస్బిఐ, ఏపీజీవీబీ బ్యాంకులో పిఓపి పట్టాదారు రైతులకు రుణాలు అందజేస్తున్న తరుణంలో డిసిసిబి బ్యాంకు ఇలా రుణాలు నిరాకరించడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. డిసిసిబి ఉన్నతాధికారులు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.