వైరాలో నాసిరకంగా నిర్మాణం చేపట్టిన గిరిజన భవన పనులను గురువారం తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య వీరభద్రం ఆధ్వర్యంలో పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ గిరిజన భవన నిర్మాణాన్ని నాసిరకంగా చేపడుతున్నాడని, వైరా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కనే ఇలా నిర్మాణం చేపట్టడం ఏమిటంటూ నిలదీశారు. గడ్డ కట్టిన సిమెంట్, డస్ట్ పౌడర్ తో పనులు చేపడుతున్నారని వీరభద్ర నాయక్ ఆరోపించారు.