పాఠశాల ముందు విద్యార్థి సంఘాల నిరసన

57చూసినవారు
పాఠశాల ముందు విద్యార్థి సంఘాల నిరసన
జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులను ఫిజికల్ డైరెక్టర్ కొట్టడం జరిగిందని శుక్రవారం ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఎ నాయకులు పాఠశాల ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం జిల్లా సహాయ కార్యదర్శి వంశి, మండల కార్యదర్శి యశ్వంత్ మాట్లాడుతూ. గతంలో అనేక ఆరోపణలు వచ్చినా విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. విద్యార్థుల చిత్రహింసలకు గురి చేస్తున్న ఆ టీచర్ పై చర్యలు తీసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్