కారేపల్లి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలను మంగళవారం తెలంగాణ ఆదర్శ పాఠశాల అడిషనల్ డైరెక్టర్ ఎస్ శ్రీనివాస చారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల తరగతి గదులను, ల్యాబ్స్, గ్రంథాలయం, వివిధ రికార్డులను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పాఠశాలలో విద్యార్థులకు ప్రయోగాత్మక నిరూపణ పద్ధతిలో విద్యా బోధనను పాటించాలని, అత్యుత్తమ ఫలితాల సాధనకు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టినీ సారించాలని అన్నారు.