కారేపల్లి శ్రీ వెంకటసాయి నగర్ కాలనీ వాసులు ఆదివారం స్థానికంగా ఉన్న సింగరేణి టౌన్షిప్ లో వన భోజనాలకు వెళ్లారు. చిన్నారులు, మహిళలు, పెద్దలు అందరూ ఆటపాటలతో సంతోషంగా గడిపారు. అక్కడే వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. అంతకు ముందు వన దేవతకు ప్రత్యేక పూజలు చేసి, వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు పండాలని, పశుపక్షాదులు చల్లగా ఉండాలని మనదేవతలను కొలిచారు.