Top 10 viral news 🔥
తిరుమల లడ్డూలో గుట్కా ప్యాకెట్ కలకలం
ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ మరోసారి అపవిత్రమైంది. ఖమ్మం జిల్లాలో ఉంటున్న దొంతు పద్మావతి తన బంధువులతో కలిసి సెప్టెంబర్ 19న తిరుమలకు వెళ్లి వచ్చారు. అయితే బంధువులకు పంచేందుకు తిరుమల లడ్డూను తీసుకొచ్చారు. శ్రీవారి లడ్డూని పంచేందుకు తెరిచి చూడగా.. అందులో గుట్కా ప్యాకెట్, చిన్న పొగాకు ముక్కలు కనిపించడంతో ఆమె ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కల్తీ నెయ్యితో ప్రపంచ వ్యాప్తంగా తిరుమల లడ్డూ వివాదం కొనసాగుతున్న వేళ మరో దారుణం జరిగింది.