గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన తల్లాడ మండలంలోని ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లాడకు చెందిన బీజేపీ మండల అధ్యక్షుడు తండ్రి చల్లా కృష్ణ (60) ఆదివారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై పంట పొలానికి వెళుతుండగా, ఎన్టీఆర్ కాలనీ నందు గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.