తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామంలో డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మలపల్లి రమేష్ బుధవారం ప్రారంభించారు. రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరతో కొనుగోలు చేస్తుందని ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని సూచించారు.