కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం వైరా నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పదేళ్ల బిఆర్ యస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు.