దేశానికి వెన్నుముక రైతన్న అని వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ అన్నారు. వైరా సొసైటీ కార్యాలయంలో శనివారం సొసైటీ అధ్యక్షులు బొర్రా రాజశేఖర్ అధ్యక్షతన రైతు భరోసా పథకంపై ప్రత్యేక మహాసభ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు. రైతులకు ఏకకాలంలో 5. 2 లక్షల రుణమాపీ చేస్తుందన్నారు.