చిరుజల్లులతో చిగురిస్తున్న రైతన్న ఆశలు

54చూసినవారు
చిరుజల్లులతో చిగురిస్తున్న రైతన్న ఆశలు
వైరా నియోజకవర్గ వ్యాప్తంగా పలు మండలాలలో గత వారం రోజులుగా కురుస్తున్న చిరుజల్లులతో రైతులు సాగుచేసిన పత్తి, మిర్చి నారు, మొక్కజొన్న వంటి చిగురుస్తుండటంతో రైతన్నలు మురిసిపోతున్నారు. జూన్ మొదటి వారంలోనే విత్తనాలు విత్తుకున్న రైతులు వర్షాల కోసం ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే వారం రోజులుగా భారీ వర్షం కాకుండా చిరుజల్లులు పడుతుండటంతో రైతులు విత్తుకున్న విత్తనాలు మొలకెత్తాయి.