వైరా నియోజకవర్గంలో మంట పుట్టిస్తున్న కూరగాయల ధరలు చూసి సామాన్యుల ఇళ్లల్లో నిత్యం వంట చేసుకోవడం ఓ తంటగా మారింది. రూ. 250లకు వారం రోజులకు సరిపడా కూరగాయలు వచ్చేవి. అలాంటిది ప్రస్తుతం రూ. 600 ఖర్చు చేసినా వారం రోజులు సరిపడా కూరలు లభించడం లేదని జనాలు వాపోతున్నారు. ప్రతిరోజు ఆహారంలో ప్రతి ఒక్కరూ ఉపయోగించే టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డల ధరలు ఆకాశన్నంటుతుండడంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.