తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఆదివారం వైరా మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ హాజరవుతారు. కావున వైరా మండలం, పట్టణం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని కోరారు.