వైరా నియోజకవర్గం సింగరేణి మండలం పేరుపల్లిలోని గురువమ్మ తల్లిని వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ సోమవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఈనెల 12న గురువమ్మ తల్లి జాతర ప్రారంభం కాగా మూడవ రోజైన సోమవారం, వైరా ఎమ్మెల్యే ఆ తల్లిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు.