వైరా మండలంలో బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్బంగా మొక్కజొన్న కల్లాలు, మార్కెట్ యార్డ్ ను పరిశీలించి వెంటనే ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మార్కెట్లో అక్రమంగా షెడ్లను వాడుతున్న మొక్కజొన్న విత్తనాల కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని మార్కెట్ యార్డ్ అధికారులకు సూచించారు.