వైరా: నేడు, రేపు తెలంగాణ రైతు సంఘం దీక్షలు

61చూసినవారు
వైరా: నేడు, రేపు తెలంగాణ రైతు సంఘం దీక్షలు
రైతుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్లో 46 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న రైతు నేత జగ్జీత్ సింగ్ దలైవాల్ కు మద్దతుగా జిల్లాలో శుక్ర, శనివారం నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు తెలిపారు. వైరా మున్సిపాలిటీ పరిధిలోని గండగలపాడులో గురువారం ఆయన మాట్లాడారు. కేంద్రం జగ్జీత్ సింగ్ దీక్షపై స్పందించే వరకు ఆందోళనలు కొనసాగుతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్