మనువాదుల నుంచి భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా వైరా డివిజన్ సిపిఎం నాయకులు భూక్య వీరభద్రం, అన్నారు. రైతు సంఘ నాయకులు బొంతు రాంబాబుతో కలిసి సోమవారం వైరా పట్టణంలో బహిరంగ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని, మార్చే ప్రయత్నం చేస్తుందని, ఆ ఆలోచనను వెంటనే ఉపసాహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.