గత ప్రభుత్వం ధరణితో రైతులను నట్టేట ముంచిందని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. ప్రభుత్వం భూభారతి వెబ్ సైట్ పై రైతులకు విధివిధానాలు వివరించే వీడియో కాన్ఫరెన్స్లో కారేపల్లి రైతువేదిక నుంచి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రతి రైతుకు అర్థమయ్యే విధంగా ప్రభుత్వం భూభారతిని రూపొందించిందని చెప్పారు. భూ భారతితో రైతుల సమస్యలు తీరుతాయని పేర్కొన్నారు.