వైరా మున్సిపాలిటీ పల్లిపాడు గ్రామానికి చెందిన గంజినబోయిన శేషయ్య ప్రమాదవశాత్తూ మృతి చెందారు. ఇది తెలుసుకున్న తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు బొంతు రాంబాబు శేషయ్య పార్దీవ దేహానికి శనివారం పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాడ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బాణాల శ్రీనివాసరావు, సొసైటీ డైరెక్టర్ సంక్రాంతి నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.