వైరా: మహిళలు స్వయంశక్తితో ఎదగాలి

70చూసినవారు
వైరా: మహిళలు స్వయంశక్తితో ఎదగాలి
మహిళలు అందివచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్వయంశక్తితో ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. మంగళవారం వైరా మండలం పుణ్యపురం పర్యటన ముగించుకుని ఖమ్మం వెళ్తుండగా కేజీ సిరిపురంలో గ్రామ మహిళా సమాఖ్య సమావేశం జరుగుతోందని తెలిసి హాజరయ్యారు. గ్రామ పరిస్థితి, తాగునీటి సరఫరా, పాఠశాల నిర్వహణ, వైద్యులు, గ్రామ కార్యదర్శి పనితీరు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీసి మాట్లాడారు.

సంబంధిత పోస్ట్