ఖమ్మం జిల్లా వైరా మండల పరిధిలోని గొల్లపూడికి చెందిన పొరల రవిపై శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకొని రవిని ఆసుపత్రికి తరలించారు. అయితే రవిని ఎవరు ఎందుకు పొడిచారనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. పాత కక్షల ఏమైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు.