వైరా: మెగా జాబ్ మేళా వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ

83చూసినవారు
వైరా: మెగా జాబ్ మేళా వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ
సింగరేణి సంస్థ సహకారంతో ఈనెల 24న ఖమ్మం జిల్లా వైరాలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన వాల్ పోస్టర్ ను శనివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. 80 కంపెనీలతో 5000 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామ్ రెడ్డి, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, సింగరేణి సీఎండి శ్రీ ఎన్. బలరామ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్