భారీ వర్షాలకు సాగర్ ఎడమ కాలువ గండ్లతో సకాలంలో పూడ్చకపోతే సోమవారం నుంచి సాగునీటి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు హెచ్చరించారు. వైరాలోని బోడేపూడి వెంకటేశ్వర రావు భవన్లో నిర్వహించిన రైతు సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. గండ్లు పడి 20 రోజులైన సకాలంలో ప్రభుత్వం మరమ్మతులు చేయకపోవడం సరికాదని, పంటలు ఎండిపోయిన రైతులకు పరిహారం అందించాలన్నారు.