
చొక్క పట్టుకుని అడిగే రోజులు త్వరలోనే వస్తాయి: జగన్
AP: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు త్వరగా రావాలని, ఎన్నికలు త్వరగా వస్తే చంద్రబాబును ప్రజలు అధికారం నుంచి దించేస్తారని ఆరోపించారు. చొక్క పట్టుకుని అడిగే రోజులు, తరిమికొట్టే రోజులు త్వరలోనే వస్తాయని వ్యాఖ్యానించారు. జగన్ 2.0లో కార్యకర్తలకే తొలి ప్రాధాన్యత ఉంటుందని భరోసా ఇచ్చారు.