వైరా: ప్రవేశాల సంఖ్య మరింత పెరగాలి

54చూసినవారు
వైరా: ప్రవేశాల సంఖ్య మరింత పెరగాలి
పదో తరగతి తర్వాత విద్యార్థులెవరూ చదువు మానేయకుండా చూస్తూ, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరేలా అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి కె. రవిబాబు సూచించారు. వైరా జూనియర్ కళాశాలను సోమవారం తనిఖీ చేసిన ఆయన అధ్యాపకులతో సమావేశమయ్యారు. ప్రతీ అధ్యాపకుడు ఓ ప్రభుత్వ పాఠశాలకు నోడల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తూ పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థుల తల్లిదండ్రులను కలవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్