ఖమ్మంలో విజయవంతంగా ముగిసిన యమహా మైలేజ్ ర్యాలీ

65చూసినవారు
ఖమ్మంలో విజయవంతంగా ముగిసిన యమహా మైలేజ్ ర్యాలీ
ఖమ్మం పట్టణంలో ప్రముఖ వాహనాల బ్రాండైన యమహా వాహనాల డీలర్ JGP మోటార్స్ వారు 30 కిలోమీటర్ల రియల్ రోడ్ మైలేజ్ టెస్ట్ ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అత్యంత ప్రజాదారణ పొందిన స్మార్ట్ హైబ్రిడ్ సిస్టం కలిగిన యమహా ఫెసినో 125 సిసి మరియు యమహా రే జెడ్ఆర్ 125 సిసి వాహనాలు ప్రదర్శించబడ్డాయి. ఈ ప్రదర్శనలో పాల్గొన్న 20 వాహనాల్లో అత్యధిక మైలేజి పొందిన ముగ్గురు వాహనదారులు అభిరాం (98.3 kmpl ), నాగార్జున (92.3 kmpl), భగవాన్ శర్మ (82.4 kmpl) వారికి యాజమాన్యం బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా యాజమాన్యం వారు మాట్లాడుతూ యమహా బ్రాండ్ కి సంబంధించిన ప్రతి వాహనం లేటెస్ట్ టెక్నాలజీ కలిగి ఉండడం వలన అత్యధిక మైలేజ్ కలిగి ఉంటాయని తెలిపారు. మార్కెట్లో ఉన్న ఇతర వాహనాల బ్రాండ్ల కంటే యమహా వాహనాలు ఎక్కువ దీర్ఘకాలిక మైలేజ్ ఇవ్వడం గొప్పగా చాటుకుంటున్నాయని తెలిపారు. యమహా వాహనాలు రోజువారి అవసరాల కోసం ఎక్కువ దూరాలు ప్రయాణించే వారికి తక్కువ ఖర్చుతో కూడుకొని ఉంటాయని వెల్లడించారు. మహిళలు మరియు స్టూడెంట్స్ కోసం రూపొందించబడిన స్కూటర్లు, ఎంతో ఆకర్షణీయంగా అవసరమైన టెక్నాలజీ, స్టైల్, మైలేజ్ మరియు దృఢమైన ఇంజన్ ను కలిగి ఉంటాయని కంపెనీ పేర్కొంది. రాబోయే రోజుల్లో మరిన్ని మోడల్స్ అందించే విధంగా కంపెనీ కృషి చేస్తోందని తెలిపింది. ఈ కార్యక్రమాన్ని ఆదరించి తమ విలువైన సమయాన్ని కేటాయించి విచ్చేసిన ప్రతి ఒక్కరికి జేజిపి మోటార్స్ యాజమాన్యం వారు మరియు యమహా కంపెనీ ప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్