ఇల్లందు మండలంలోని సుభాష్ నగర్ గ్రామ పంచాయతీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రెండు రోజులుగా అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. విషయం తెలుసుకున్న ఇల్లెందు పోలీసులు అతన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆచూకీ తెలిసిన వారు 8712820700 నంబర్లకు సంప్రదించాలని ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి కోరారు.