రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన కామేపల్లి మండలంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. వ్యక్తిగత పనుల నిమిత్తం ఓ వ్యక్తి కామేపల్లి వెళ్తుండగా మర్రిగూడెం వద్ద ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడి వివరాలు తెలియాల్సి ఉంది.