టేకులపల్లి మండలం గంగారం పంచాయతీ పరిధిలోని సిద్ధారం దేవాలయం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి (45) మృతదేహాన్ని బుధవారం రాత్రి స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న బోడు ఎస్సై పొడిశెట్టి శ్రీకాంత్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కొత్తగూడెం సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి సంబంధీకులెవరైనా ఉంటే పోలీసులను సంప్రదించాలని ఎస్సై తెలిపారు.