పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం ఖమ్మం, కొత్తగూడెం, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు ఆయా జిల్లాల్లో వానలు పడతాయని చెప్పింది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిస్తుందని తెలిపింది.