బాలికపై ముగ్గురు టీచర్లు అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై సినీ నటి ఖుష్బూ సుందర్ స్పందించారు. అత్యాచారాలకు పాల్పడే వారికి జీవించే హక్కు లేదని, ఇళ్లలో, వీధుల్లో, విద్యా సంస్థల్లో, హాస్టళ్లలో ఎక్కడ పిల్లలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలంటూ ట్విట్టర్ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.