వయనాడ్ జిల్లాలో ఇటీవల కాఫీ తోటలో పనిచేస్తున్న రాధ(45) అనే మహిళపై పులి దాడి చేసి చంపిన ఘటన కేరళలో సంచలనం రేపింది. దీనిపై స్థానికంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళపై దాడి చేసిన పులిని మ్యాన్ ఈటర్‌గా ప్రకటించిన ప్రభుత్వం.. అది కంటపడితే చంపేయాలని ఆదేశాలు జారీచేసింది. జిల్లా ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం రాష్ట్ర మంత్రి శశీంద్రన్ ఈ ప్రకటన చేశారు.