ఆల్‌ఖైదా అరేబియన్ పెనిన్‌సులా అధినేత సాద్ బిన్ అతీఫ్ అల్ అవ్లాకీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను చంపేయాలని పిలుపునిస్తూ 34 నిమిషాల వీడియో విడుదల చేశాడు. ట్రంప్‌తో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌లను కూడా లక్ష్యంగా చేసుకోవాలని వీడియోలో సూచించాడు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.