హనీమూన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన భర్త రాజా రఘువంశీని చంపేందుకు కిరాయి గూండాలకు సోనమ్ రూ.20 లక్షలు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు. తొలుత వారికి రూ.4 లక్షలు ఇవ్వగా నిరాకరించడంతో రూ.20 లక్షలు ఇచ్చి హత్యకు ప్రేరేపించినట్లు తెలిపారు. రాజాను హత్య చేసిన వెంటనే 'ఏడేడు జన్మల్లోనూ నువ్వే నా తోడుగా' అనే క్యాప్షన్‌తో ఫోన్లో వాట్సాప్ స్టేటస్‌గా సోనమ్ పెట్టుకుంది.