బీజేపీ పాలనలో యూపీలో దళితులపై దౌర్జన్యాలు, హత్యలు పెరిగిపోవడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్యలో దళిత యువతిపై జరిగిన హత్యాచార ఘటనను ఆయన హృదయ విదారకమని తెలిపారు. ఈ దారుణ ఘటనతో మరో ఆడబిడ్డ జీవితాన్ని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని కుటుంబాలు ఇలానే నాశనమవ్వాలా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ ఘటనపై వెంటనే తక్షణ విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.